AP High Court: ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అంశంపై విచారణ వాయిదా
ABN , Publish Date - Dec 27 , 2023 | 08:09 PM
AP High Court: ‘ఏపీలోని జగన్ ప్రభుత్వం చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించగా.. అదే విషయాన్ని పిటిషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు.
ఏపీలోని జగన్ ప్రభుత్వం చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించగా.. అదే విషయాన్ని పిటిషన్ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వాదించారు. ఆర్టీఐ ద్వారా తీసుకున్న వివరాలు కోర్టుకు ఇచ్చామని పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాగా వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.