AP BJP: ఈనెల 10న కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ పిలుపు

ABN , First Publish Date - 2023-08-08T14:22:48+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 10న కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది.

AP BJP: ఈనెల 10న కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ పిలుపు

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 10న కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ (AP BJP) పిలుపునిచ్చింది. రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోనల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరుబాట పట్టాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి (AP BJP Chief Daggubati Purandeswari) సూచించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ... గ్రామ పంచాయతీల నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళనకు గతంలోనే బీజేపీ మద్దతు పలికిందని గుర్తుచేశారు. పంచాయితీల నిధులను స్వాహాచేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని ప్రశ్నించారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితులు ఏర్పడుతున్నాయన్నారు. సర్పంచ్‌ల హక్కుల సాధనకై పోరుబాట పడుతున్నామని తెలిపారు. రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలతో ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-08T14:22:48+05:30 IST