TS HighCourt: జగన్ కేసులపై విచారణ మరో మూడు నెలలు వాయిదా
ABN , Publish Date - Dec 15 , 2023 | 03:49 PM
Andhrapradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసులపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిల్‌పై విచారణ కొనసాగింది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టులో (Telangana HighCourt) శుక్రవారం విచారణ జరిగింది. మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Former MP Hariramajogaiah) దాఖలు చేసిన పిల్‌పై విచారణ కొనసాగింది. ప్రజాప్రతినిధుల కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుమోటో పిల్‌గా హైకోర్టు విచారణకు తీసుకుంది. ఏపీ సీఎం జగన్, సీబీఐకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు విచారణ చేస్తున్న సుమోటో పిల్‌తో కలిపి జగన్ కేసుల పిటిషన్లను జత పరచాలని రిజిస్ట్రీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కాగా జగన్‌పై ఉన్న కేసులు విచారణ వచ్చే ఎన్నికలోపు పూర్తి చేసి తీర్పునివ్వాలని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే 20 కేసుల్లో డిస్‌ఛార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కోర్టులో సీబీఐ ప్రస్తావించింది. జనవరి 5 లోపు డిశ్చార్జ్ పిటిషన్లను విచారిస్తామని సీబీఐ కోర్టు చెప్పిందని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. మరో మూడు కేసుల్లో స్టే ఉందని కోర్ట్‌కు సీబీఐ న్యాయవాది చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.