Share News

2024 Holidays: 2024 సెలవులను ప్రకటించిన ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2023-12-13T12:06:50+05:30 IST

Andhrapradesh: 2023కు బైబై చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాము. ఈ క్రమంలో 2024లో వచ్చే సెలవులకు సంబంధించిన ప్రకటనను ఏపీ సర్కార్ విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సాధారణ సెలవులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

2024 Holidays: 2024 సెలవులను ప్రకటించిన ఏపీ సర్కార్

అమరావతి: 2023కు బైబై చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాము. ఈ క్రమంలో 2024లో వచ్చే సెలవులకు (2024 Holidays) సంబంధించిన ప్రకటనను ఏపీ సర్కార్ (AP Government) విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్‌కు సాధారణ సెలవులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 27 సాధారణ సెలవులతో పాటు, 25 ఐచ్చిక సెలవులుగా సూచిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణ సెలవులు ఇవే..

జనవరి 15 సంక్రాంతి(సోమవారం), జనవరి 16 కనుమ(మంగళవారం) జనవరి 26 రిపబ్లిక్ డే(శుక్రవారం), మార్చ్ 8 మహాశివరాత్రి (శుక్రవారం), మార్చ్ 25 హోళి(సోమవారం), మార్చ్ 29 గుడ్ ఫ్రైడే (శుక్రవారం), ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ జయంతి (శుక్రవారం), ఏప్రిల్ 9 ఉగాది (మంగళవారం), ఏప్రిల్ 11 ఈదుల్ ఫితర్(రంజాన్)(గురువారం), ఏప్రిల్ 17 శ్రీరామనవమి(బుధవారం), జూన్ 16 బక్రీద్ (సోమవారం), జూలై 17 మోహర్రం (బుధవారం), జూలై 27 బోనాలు(సోమవారం), ఆగష్టు 15 స్వాంతంత్ర్యదినోత్సవం (గురువారం), ఆగష్టు 26 శ్రీకృష్ణాష్టమి (సోమవారం), సెప్టెంబర్ 7 వినాయకచవితి(శనివారం), సెప్టెంబర్ 16 ఈద్ మిలాద్-ఉన్-నబీ (సోమవారం), అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి (బుధవారం), అక్టోబర్ 11 దుర్గాష్టమి (శుక్రవారం), అక్టోబర్ 31 దీపావళి (గురువారం), డిసెంబర్ 25 క్రిస్మస్ (బుధవారం).


ఐచ్చిక సెలవులు

జనవరి 1 న్యూఇయర్ (సోమవారం), జనవరి 25 హజరత్ అలీ జయంతి(గురువారం), ఫిబ్రవరి 7 షాబ్ -ఈ-మెరాజ్ (బుధవారం), ఏప్రిల్ 1 షహదత్-హజ్రత్-అలీ (సోమవారం), ఏప్రిల్ 5 జుమాతుల్ వేడా (శుక్రవారం), మే 10 బసవ జయంతి (శుక్రవారం), మే 23 బుద్ధ పౌర్ణమి(గురువారం), జూన్ 25 ఈద్ ఇ గాధీర్ (మంగళవారం), జూలై 16 9వ మోహర్రం (మంగళవారం), ఆగష్టు 15 పార్సీ న్యూఇయర్ డే (గురువారం), ఆగష్టు 16 వరలక్ష్మీ వ్రతం (శుక్రవారం), అక్టోబర్ 2 మహాలయ అమావాస్య (బుధవారం), సెప్టెంబర్ 15 యాజ్ దహుమ్ షరీఫ్ (మంగళవారం), కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి (శుక్రవారం), నవంబర్ 11 హజత్ సయ్యద్ మహ్మద్ జువన్ పురి మహదీ(శనివారం), డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్(మంగళవారం), డిసెంబర్ 26 బాక్సింగ్ డే (గురువారం)

శని, ఆదివారాలు వచ్చిన సెలవులు

జనవరి 14 భోగి ( ఆదివారం), ఫిబ్రవరి 2 షాబ్ ఈ భారత్ (ఆదివారం), ఏప్రిల్ 7 షాబ్ ఈ ఖాదీర్ (ఆదివారం), ఏప్రిల్ 21 మహవీర్ జయంతి (ఆదివారం), ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (ఆదివారం), జూలై 7 రథయాత్ర(ఆదివారం), ఆగష్టు 25 ఆర్బయీన్ (ఆదివారం) అక్టోబర్ 12 విజయదశమి (రెండో శనివారం).

Updated Date - 2023-12-13T16:48:48+05:30 IST