Amaravati : రాజధాని ప్రాంతం పరిధిలో గ్రీన్ జోన్ రద్దు.. భూముల ధరలు ఢమాల్!
ABN , First Publish Date - 2023-08-28T22:28:33+05:30 IST
ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్‌ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. .
అమరావతి : ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్‌ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్-282ను జగన్ సర్కార్ రద్దు చేసింది. దాని స్థానంలో తాజాగా.. జీవో నంబర్-113ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతిలో భూముల ధరలు (Amaravati Lands Rate) తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. భూముల ధరలను తగ్గించడానికే ప్రభుత్వం ఇలా కుట్ర చేస్తోందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా నడుస్తుండగానే..!
కాగా.. ఇప్పటికే అమరావతిలోని ఆర్-5 జోన్‌లో (R-5 Zone) ఇళ్ల నిర్మాణంపై అటు ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులు కోర్టు మెట్లెక్కారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం విదితమే. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యానికి సుప్రీం రిజిస్ట్రీ డైరీ నంబరును కేటాయించింది. అయితే.. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వ్యవహారం ఇలా నడస్తుండగానే తాజాగా రాజధానిలో ఇలా గ్రీన్ జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.