AP GOVT: టీటీడీ నిధుల కేటాయింపుపై ప్రజావ్యతిరేకత.. వెనక్కి తగ్గిన ఏపీ సర్కారు
ABN , First Publish Date - 2023-10-20T21:24:06+05:30 IST
తిరుపతి అభివృద్ధికి టీటీడీ వార్షిక బడ్జెట్‌లో ఒక శాతం కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు.
అమరావతి: తిరుపతి అభివృద్ధికి టీటీడీ వార్షిక బడ్జెట్‌లో ఒక శాతం కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. టీటీడీ నిధులు కేటాయింపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం తోక ముడిచింది. కొద్దిసేపటి క్రితం సర్క్యులర్‌ను టీటీడీ కార్యనిర్వహణ అధికారికి ప్రభుత్వం పంపించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ మెమో విడుదల చేశారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు టీటీడీ నుంచి ఒక శాతం నిధులు తీసుకోవడంపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఇది భక్తుల విజయమని బీజీపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తులకు మీడియా అండగా నిలబడటంతోనే ఇది సాధ్యమైందన్నారు.