AP Highcourt: పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

ABN , First Publish Date - 2023-06-22T12:34:01+05:30 IST

పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు.

AP Highcourt: పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో (AP HighCourt) గురువారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ ఇంజనీర్లను వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి ఈరోజు న్యాయస్థానానికి వచ్చారు. పెద్దఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ సంబంధింత అధికారులు పట్టించుకోవడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది పాలేటి మహేష్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సింది ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-06-22T12:34:01+05:30 IST