AP News: రాజ్భవన్లో గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2023-06-20T20:31:06+05:30 IST

రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (Governor Abdul Nazeer)ను టీడీపీ (TDP) నేతలు కలిశారు. 

AP News: రాజ్భవన్లో గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు

అమరావతి: రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (Governor Abdul Nazeer)ను టీడీపీ (TDP) నేతలు కలిశారు. ఏపీ (AP)లో శాంతిభద్రతల వైఫల్యాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. ఏపీలో ఆర్టికల్ 355ను అమలు చేయాలని కోరినట్లు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు (Acham Naidu) తెలిపారు. ‘‘శాంతిభద్రతల నియంత్రణకు అధికారిని నియమించాలని కోరాం. ఏపీలో జరుగుతోన్న హత్యాకాండను గవర్నరుకు వివరించాం. జూన్లో 15 రోజుల్లో.. 15 సంఘటనలు జరిగాయి. రోజుకో హత్య, దోపిడీ, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి. రేపల్లెలో పదోతరగతి పిల్లాడిని పథకం ప్రకారం చంపేశారు. రేపల్లెలో పదోతరగతి పిల్లాడు హత్యకు గురైతే సీఎం జగన్ (CM Jagan) వెళ్లరా?’’ అని అచ్చెన్నాయుడు వివరించారు.

Updated Date - 2023-06-20T20:31:06+05:30 IST