Ap News: మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారం
ABN , First Publish Date - 2023-06-19T22:01:22+05:30 IST
మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ముదినేపల్లి మండలంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న చెందిన మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది.
మచిలీపట్నం: మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. ముదినేపల్లి మండలంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న చెందిన మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టూ అనుయాయుడైన ఆవుల సతీష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతనికి మణికంఠ, కళ్యాణ్ సహకరించారని సమాచారం. ఓ హాస్టల్‌లో ఉంటున్న మైనర్ బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేయగా, సోమవారానికి కూడా బాలిక రాకపోవడంతో హాస్టల్ వార్డెన్ మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు మహిళల ఆందోళనతో పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. సహకరించిన వారి కోసం వెతుకుతున్నారు.