Home » Machilipatnam
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.
గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన ముగ్గురు బాలుర మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేధించారు. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రత్యేకంగా 20 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి.. బాలురను సురక్షితంగా వారి తండ్రి చెంతకు చేర్చారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు (అన్నదమ్ములు) మిస్సింగ్ అయ్యారు. ఉదయం స్కూల్కు అని బయలుదేరినవారు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు మచిలీపట్నం, ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇసుక ఉచిత పంపిణీ పథకం ప్రారంభం రోజున ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఇసుక అక్రమ తరలింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలు ఎవరూ ఇసుక జోలికి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పారు.
రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం ప్రముఖుల పేర్లు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
మచిలీపట్నం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బందర్ పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
మచిలీపట్నంలో 180 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చి వేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్మాణాలు కూల్చి వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు.
మచిలీపట్నంలో పవన్ కుమార్ అనే యువకుడు ఓ బాలిక(15)పై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులుగా చిన్నారి వెంట పడుతున్న కామాంధుడు ఆమె కదలికలపై నిఘా పెట్టి దారుణానికి ఒడికట్టాడు.
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.