Share News

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్.. పురందేశ్వరి మద్యం సేవిస్తారేమో! నేను తాగను.. నాన్‌వెజ్‌ తినను

ABN , First Publish Date - 2023-10-29T09:14:42+05:30 IST

‘నేను లిక్కర్‌ తాగను, నాన్‌వెజ్‌ తినను.. పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్.. పురందేశ్వరి మద్యం సేవిస్తారేమో! నేను తాగను.. నాన్‌వెజ్‌ తినను

- హితేశ్‌, భరత్‌, బ్రోకర్‌ చెప్పింది విని నాపై ఆమె ఆరోపణలు

- కుటుంబ ఎజెండాతో రాజకీయం

- ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

బాపట్ల, (ఆంధ్రజ్యోతి): ‘నేను లిక్కర్‌ తాగను, నాన్‌వెజ్‌ తినను.. పురందేశ్వరి గారు మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు. ఏమేం బ్రాండ్లు ఉంటాయో కూడా తెలియదు. ఆమె ఈ విషయం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) అన్నారు. శనివారం బాపట్లలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణం వెనుక తాను, ఎంపీ మిథున్‌రెడ్డి ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కుమారుడు హితేశ్‌, గీతం యూనివర్సిటీ భరత్‌తో పాటు లిక్కర్‌ సిండికేట్‌ బ్రోకర్‌ చెప్పిన మాటలు విని తన మీద, ఎంపీ మిథున్‌రెడ్డి(MP Mithun Reddy) మీద ఆధారాల్లేకుండా మద్యం ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. పురందేశ్వరి చేసిన పనులు తాను బయటపెడితే ఆమె ఎక్కడ ఏం చేసుకుంటుందో తెలియదని.. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని వ్యాఖ్యానించారు. ఆమె నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారని.. తనకంటూ ఒక నియోజకవర్గం లేని వ్యక్తి అని ఎద్దేవాచేశారు. కుటుంబ ఎజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని.. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. లోకేశ్‌కు నాయకుడి లక్షణాలు లేవని విమర్శించారు.

Updated Date - 2023-10-29T09:14:42+05:30 IST