AP News: ఫేక్ ప్రచారంపై టీడీపీ నేత వర్ల ఫైర్

ABN , First Publish Date - 2023-04-15T17:10:13+05:30 IST

ఫేక్ టీడీపీ నాయకుల్ని సృష్టించి, వారితో ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారం చేయించి మరలా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి,...

AP News:  ఫేక్ ప్రచారంపై టీడీపీ నేత వర్ల ఫైర్

అమరావతి: ఫేక్ టీడీపీ నాయకుల్ని సృష్టించి, వారితో ఫేక్ వీడియోలతో ఫేక్ ప్రచారం చేయించి మరలా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి, అతనికొడుకు భార్గవ్ రెడ్డి పాకులాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్.ఎం.కే.ఆర్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడైన మన్విత్ కృష్ణారెడ్డి, వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుడైన సజ్జల భార్గవ్ రెడ్డికలిసి జగన్ రాజకీయ లబ్ధికోసం చేయాల్సిన ఛండాలమంతా చేస్తున్నారని మండిపడ్డారు. కడపకు చెందిన రామాల మన్విత్ కృష్ణారెడ్డి కరుడుగట్టిన వైసీపీ నాయకుడన్నారు. అలాంటి వాడికి టీడీపీ కండువా వేయించి, బ్యాక్ గ్రౌండ్‌లో చంద్రబాబు బొమ్మ పెట్టి, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రాంతీయతత్వాన్ని రే కొడతారా? అని ఆయన ప్రశ్నించారు. వివిధవర్గాలు, ప్రాంతాలు, మతాల్ని కించపరిచేలా మన్విత్ రెడ్డి లాంటి కరుడుగట్టిన తన అభిమానికి టీడీపీ ముసుగువేయించి, ఆ విధంగా మాట్లాడించి తాను ముఖ్యమంత్రి కావాలన్నదే జగన్ లక్ష్యమా? అని ప్రశ్నించారు.

జగన్‌కు తెలిసే సజ్జల భార్గవ్‌రెడ్డి, మన్విత్ కృష్ణారెడ్డి ప్రజల్ని తప్పుదారిపట్టించేలా ఫేక్ ప్రచారంచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారం చూశాక, గతంలో అధికారం దక్కించుకోవడానికే కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్యకు జగన్ పథక రచన చేశాడు అనిపిస్తోందన్నారు. అధికారంకోసం కాకపోతే, బాబాయ్ హత్యకేసు విచారణపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక దాన్నిఎందుకు వెనక్కుతీసుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టుఆదేశాలతో జరుగుతున్న సీబీఐ విచారణను, తన అధికారబలంతో అడుగడుగునా అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకుడైన భార్గవ్ రెడ్డి, అతను ఆడమన్నట్టు ఆడుతూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నమన్విత్ కృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వర్ల డిమాండ్ చేశారు. టీడీపీ కూడా వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సీఐడీకి ఫిర్యాదు చేయబోతోందన్నారు. 2004లో ఏమీలేని జగన్ నేడు దేశంలోనే అత్యంతధనికుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారో రాష్ట్రప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు మరోసారి జగన్‌ను, అతని ఫేక్ ప్రచారాన్ని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఏపీ ప్రజలకు జగన్‌పై ఉన్న నమ్మకం ఏస్థాయికి వెళ్లిందంటే, ఆయన సొంతతల్లి, చెల్లే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికేస్థాయికి వచ్చారని అనుకుంటున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న తల్లి, చెల్లి పావురాల్లాగా వేటగాడైన జగన్ వలలో పడతారని ప్రజలు భయపడుతున్నారని విమర్శించారు. తల్లి, చెల్లికి తక్షణమే కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా జగన్‌పై ఉందన్నారు.

Updated Date - 2023-04-15T17:10:13+05:30 IST