AP News: జగన్ ఆకాంక్ష అదే: వర్ల
ABN , First Publish Date - 2023-05-22T21:43:31+05:30 IST
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేయడం సీఎం జగన్ (CM Jagan)కి ఇష్టం లేదని,...
అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేయడం సీఎం జగన్ (CM Jagan)కి ఇష్టం లేదని, కేసు దర్యాప్తు జరగకూడదు.. అసలు ముద్దాయిలు బయటకు రాకూడదని జగన్ ఆకాంక్షిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. హత్య కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని హత్య జరిగిన రోజున, హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్.. సీఎం అయిన తర్వాత పిటిషన్ వెనక్కి తీసుకోవడంలో అంత్యర్య మదేగదా? అని ప్రశ్నించారు. వైఎస్ సునీత పట్టుదలతో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించినప్పటికీ.. సీబీఐ దర్యాప్తుకు జగన్ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జగన్ అండదండలతోనే సీబీఐ అధికారులను బెదిరించే స్థాయికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని మండిపడ్డారు. సీఎం లక్ష్యం నెరవేర్చడం కోసం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. విచారణ అధికారి రాంసింగ్‌పై కేసు పెట్టడం ఇందుకు నిదర్శనమన్నారు. సీఎంవో డైరెక్షన్ ప్రకారమే ఎస్పీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో సీబీఐకి ఎప్పుడూ ఇటువంటి ఆటకం కలగలేదన్నారు.