Rains: 24 గంటల్లో ఏపీ వర్షాలు
ABN , First Publish Date - 2023-01-30T20:36:59+05:30 IST
తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం (Bay of Bengal)లో ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. ఇది మధ్యాహ్ననికి ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు..
విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం (Bay of Bengal)లో ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. ఇది మధ్యాహ్ననికి ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్‌కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి...ఆ తరువాత దక్షిణ నైరుతిగా దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం శ్రీలంక (Sri Lanka)లో తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా సోమవారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు (Prakasam Nellore), చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.