AP Govt: తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
ABN , First Publish Date - 2023-12-04T15:47:54+05:30 IST
Cyclone Michaung: ‘‘మిచాంగ్’’ తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
అమరావతి: ‘‘మిచాంగ్’’ తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టరేట్లను ఏర్పాటు చేసింది. అలాగే తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.
బాపట్ల – కాటమనేని భాస్కర్
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి
తూర్పుగోదావరి – వివేక్ యాదవ్
కాకినాడ – యువరాజ్.
ప్రకాశం – ప్రద్యుమ్న
ఎస్‌పీఎస్ నెల్లూరు – హరికిరణ్
తిరుపతి – జె.శ్యామలరావు
వెస్ట్‌గోదావరి – కన్నబాబు