Atchennaidu : పీకే స్క్రిప్ట్‌.. జగన్ అమలు.. కోడి కత్తి కమలహాసన్..

ABN , First Publish Date - 2023-04-13T15:16:17+05:30 IST

యన్ఐఏ నివేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కోడి కత్తి కమలహాసన్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో లబ్ది కోసం కోడి కత్తి డ్రామా ఆడారు. ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీపై నెపం‌నెట్టి లబ్ది పొందాడన్నారు.

Atchennaidu : పీకే స్క్రిప్ట్‌.. జగన్ అమలు.. కోడి కత్తి కమలహాసన్..

Amaravathi : యన్ఐఏ నివేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. కోడి కత్తి కమలహాసన్ జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో లబ్ది కోసం కోడి కత్తి డ్రామా ఆడారు. ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీపై నెపం‌నెట్టి లబ్ది పొందాడన్నారు. కోడి కత్తి అనేది పెద్ద డ్రామా అని తాము‌ చెబుతూనే ఉన్నామన్నారు. పీకే ఇచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ అమలు చేశాడన్నారు. రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని కోడి కత్తి కమలహాసన్ డ్రామా ఆడి యన్ఐఏకి‌ ఇవ్వాలని కోరాడన్నారు. యన్ఐఏ సంస్థ అన్ని కోణాల్లో నాలుగేళ్లుగా దర్యాప్తు చేసిందన్నారు. కోడి కత్తి సంఘటనలకు టీడీపీకి, ఇతర వ్యక్తులకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. కల్పిత ఘటనలతో ఇది చేసుకున్నారని నివేదిక ఇచ్చిందన్నారు. జగన్మోహన్ ఆడిన డ్రామాను ప్రజలంతా ఇప్పుడు అయినా తెలుసుకోవాలన్నారు. నేడు వాస్తవాలు తెలిసిన తరువాత యన్ఐఏ మీద కూడా జగన్‌కు నమ్మకం పోయిందా అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా మరో దర్యాప్తు సంస్థ కావాలని అడుగుతాడా? అని అచ్చెన్న నిలదీశారు. సీఎం పీఠం కోసం సొంత బాబాయినే హత్య చేయించాడన్నారు. ఈ సైకో రాజకీయాలకే అనర్హుడని.. ఈ‌పార్టీని బంగాళా ఖాతంలో కలపాలన్నారు. ఈ కుట్రలు, హత్యలు, దారుణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ని రాజకీయాల నుంచి అనర్హుడిగా ప్రకటించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-13T15:16:17+05:30 IST