Home » Atchannaidu Kinjarapu
Andhrapradesh: ‘‘అచ్చెన్నాయుడు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. నన్ను వైసీపీ హయాంలో జైలులో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై కొరడా ఝులిపిస్తానని అందరూ భావించారు. కక్ష సాధింపు నా విధానం కాదు’’ మంత్రి అచ్చెన్న అన్నారు.
తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
వైసైీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేతకాని తనం వల్లే పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతాలు ఘోరంగా పడిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత నారా లోకేష్ అహర్నిషలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు.
AP Agriculture Budget 2024-25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తూ దూసుకెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
Andhrapradesh: ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వాసంశెట్టి వెనకబడి ఉండడం వల్లే సీఎం చంద్రబాబు అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
Andhrapradesh: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని..
శ్రీకాకుళం జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
Andhrapradesh: వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో పశువులకు వైద్యం అందించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించనున్నారు.