Margadarsi Case: మార్గదర్శిపై సీఐడీ అధికారుల దాడులు

ABN , First Publish Date - 2023-04-19T21:09:47+05:30 IST

ఏలూరు నగరంలోని మార్గదర్శి (Margadarsi) సంస్థ కార్యాలయంలో సీఐడీ అధికారులు బుధవారం మరోమారు దాడులు కొనసాగించారు.

Margadarsi Case: మార్గదర్శిపై సీఐడీ అధికారుల దాడులు

ఏలూరు: ఏలూరు నగరంలోని మార్గదర్శి (Margadarsi) సంస్థ కార్యాలయంలో సీఐడీ అధికారులు బుధవారం మరోమారు దాడులు కొనసాగించారు. విశాఖపట్నం (Visakhapatnam) సీఐడీ డీఎస్పీ కాళిదాసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రవేశించి సోదాలు చేపట్టింది. రికార్డులను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఏలూరులో మార్గదర్శి సంస్ధ బ్రాంచ్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులోని ఏలూరు బ్రాంచ్‌ మేనేజర్‌ కం ఫోర్‌మెన్‌ గుండపనేని వెంకటరామప్రసాద్‌, డిప్యూటీ మేనేజర్‌ కం అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ కాశీభొట్ల లక్ష్మణమూర్తులు ఏలూరు జిల్లా (Eluru District) కోర్టులో యాంటీస్పెక్టరీ బెయిల్‌ దాఖలు చేసుకోగా నిబంధనలతో కూడిన బెయిల్‌ కోర్టు మంజూరుచేసింది. భీమవరం (Bhimavaram), తణుకులలో మార్గదర్శి బ్రాంచ్‌లపైన సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో నిందితులుగా ఉన్న ఆ బ్రాంచ్‌ల మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు యాంటీసెక్టరీ బెయిల్‌ను ఏలూరు జిల్లా కోర్టులో దాఖలు చేయగా కోర్టు బెయిన్‌ పిటీషన్లు కొట్టి వేసింది. ఏలూరులోని మార్గదర్శి బ్రాంచ్‌పై బుధవారం మరోమారు సీఐడీ అధికారులు ప్రవేశించి సోదాలు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ముందస్తుగా మార్గదర్శిలోకి ఇతరులు ఎవ్వరిని అనుమతించలేదు. సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-19T21:09:47+05:30 IST