కొనసాగుతున్న అవినాష్ విచారణ.. రూ.4 కోట్ల ఫండింగ్‌తో పాటు..

ABN , First Publish Date - 2023-06-10T13:41:08+05:30 IST

ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఆయనను 4 గంటలుగా సీబీఐ విచారిస్తోంది. నాలుగు కోట్లు రూపాయల ఫండింగ్‌తో పాటు పలు విషయాలపై మీడియా ఆయన్ను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజు ఎర్ర గంగి రెడ్డి చేసిన కాల్స్‌పై సీబీఐ విచారణ నిర్వహిస్తోందని తెలుస్తోంది.

కొనసాగుతున్న అవినాష్ విచారణ.. రూ.4 కోట్ల ఫండింగ్‌తో పాటు..

హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకా కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఆయనను 4 గంటలుగా సీబీఐ విచారిస్తోంది. నాలుగు కోట్లు రూపాయల ఫండింగ్‌తో పాటు పలు విషయాలపై మీడియా ఆయన్ను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజు ఎర్ర గంగి రెడ్డి చేసిన కాల్స్‌పై సీబీఐ విచారణ నిర్వహిస్తోందని తెలుస్తోంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి ని వాస్తవాలు చెప్పవద్దని ఎందుకు ప్రలోభాలకు గురి చేశారని ఆరా తీస్తోందని సమాచారం. క్రైమ్ సీన్‌లో ఆధారాలు ఎందుకు చేరిపి వేశారని అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోన్నట్టు తెలుస్తోంది. నిందితులు హత్య చేసి మీ ఇంటికి వచ్చి ఏం చెప్పారని సీబీఐ అధికారులు అడుగుతున్నారట. కేసు పెట్టవద్దని, పోస్ట్ మార్టం వద్దని సీఐ శంకరయ్యకి మీరు, శివ శంకర్ రెడ్డి ఎందుకు చెప్పారని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. నేటి సాయంత్రం 5 గంటల వరకూ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది.

Updated Date - 2023-06-10T13:41:08+05:30 IST