Ayesha Mira Case: ఆయేషా మీరా హత్య కేసు.. ముగిసిన సాక్షుల విచారణ
ABN , First Publish Date - 2023-09-06T15:08:36+05:30 IST
రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో సాక్షుల విచారణ ముగిసింది. బుధవారం సీబీఐ క్యాంపు కార్యాలయంలో సీబీఐ ఏఎస్పీ సీఆర్ దాస్ బృందం సాక్షులను విచారించారు. ఆయేషా మీరా కేసు న్యాయవాది, సాక్షి వెంకట క్రిష్ణ ప్రసాద్ ఈ విచారణకు హాజరయ్యారు.
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో (Ayesha Mira Case) సాక్షుల విచారణ ముగిసింది. బుధవారం సీబీఐ (CBI) క్యాంపు కార్యాలయంలో సీబీఐ ఏఎస్పీ సీఆర్ దాస్ బృందం సాక్షులను విచారించారు. ఆయేషా మీరా కేసు న్యాయవాది, సాక్షి వెంకట క్రిష్ణ ప్రసాద్ ఈ విచారణకు హాజరయ్యారు. అనంతరం వెంకట క్రిష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హత్య జరిగిన తరువాత ఏ టైంకు నేను హాజరు అయ్యానో సీబిఐ అధికారులు అడిగారు. ఆయేషా మీరా హత్య జరిగిన తరువాత నేనే స్వయంగా ఇంక్వేస్ట్ రిపోర్ట్ రాశాను. మృతదేహంపై గాయాలు ఉన్నాయా అని సీబిఐ అధికారులు అడిగారు. అప్పటి అధికారులు ఎవ్వరూ తెలుసా అని అడిగారు. ఆయేషా మీరా కుటుంబ సభ్యులకు నాకు ఉన్న పరిచయాల గురించి అడిగారు. ఈ కేసులో నిధితులను అరెస్టు చేయాలని విచారణకు వచ్చిన ప్రతిసారీ అడుగుతున్నా. విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అరెస్ట్ చేసిన పరిస్థితులు లేవు. హత్య జరిగి 15 యేళ్లు అవుతుంది మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సీబీఐ అధికారులు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నామని’’ సాక్షి వెంకట క్రిష్ణ పేర్కొన్నారు.