Ayyannapatrudu: 41(ఏ)నోటీస్‌ ఇచ్చి అయ్యన్నను విడిచిపెట్టిన పోలీసులు

ABN , First Publish Date - 2023-09-01T13:31:26+05:30 IST

విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసిన పోలీసులు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం ఎలమంచిలి మధ్య హైవేపై విడిచిపెట్టారు.

Ayyannapatrudu: 41(ఏ)నోటీస్‌ ఇచ్చి అయ్యన్నను విడిచిపెట్టిన పోలీసులు

అనకాపల్లి: విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసిన పోలీసులు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం ఎలమంచిలి మధ్య హైవేపై విడిచిపెట్టారు. అయ్యన్నను అరెస్ట్ చేశారన్న సమాచారంతో నక్కపల్లి ప్రాంతంలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు మోహరించారు. దీంతో పోలీసులు ముందుగానే అయ్యన్నకు 41(ఏ) నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. ప్రస్తుతం నక్కపల్లి మండలం టోల్‌ప్లాజా ముందున్న కాగిత జాస్ హోటల్‌కు అయ్యన్నపాత్రుడు, టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.


కాగా.. అయ్యన్నపాత్రుడిని ఈరోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన అయ్యన్నను ఎయిర్‌పోర్టులోని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని అయ్యన్న విమర్శించిన విషయం తెలిసిందే. గన్నవరం లోకేశ్‌ బహిరంగసభలో ప్రసంగాలకు సంబంధించి టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు అయ్యింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి.

Updated Date - 2023-09-01T14:22:46+05:30 IST