Share News

Chandrababu Bail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన బెయిల్ ఆర్డర్స్.. కాసేపట్లో చంద్రబాబు విడుదల

ABN , First Publish Date - 2023-10-31T14:52:09+05:30 IST

విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబు విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రా

Chandrababu Bail: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన బెయిల్ ఆర్డర్స్.. కాసేపట్లో చంద్రబాబు విడుదల

అమరావతి: రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry Central Jail) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) విడుదల ఉత్తర్వులు చేరాయి. విజయవాడ ఏసీబీ కోర్టు (Vijayawada ACB Court) నుంచి చంద్రబాబు బెయిల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. రాజమండ్రి సెంట్రల్ జైలుకు మెయిల్ ద్వారా ఈ ఉత్తర్వులను కోర్టు పంపించింది. ఉత్తర్వులు అందాయని సెంట్రల్ జైలు వద్ద నుంచి చంద్రబాబు తరపు న్యాయవాదులు ధృవీకరించారు. చంద్రబాబుకు జైలు అధికారులు కండిషన్స్ చదివి వినిపించనున్నారు. చంద్రబాబుకు బోండా ఉమా (Bonda Uma), దేవినేని ఉమా (Devineni Uma) షూరిటీలు ఇచ్చారు. ఇద్దరి షూరిటీలను విజయవాడ ఏసీబీ కోర్టు ఆమోదించింది. దీంతో చంద్రబాబును విడుదల చేయడమే ఇక తరువాయి అని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో పేపర్ వర్క్ పూర్తి అయిన వెంటనే మరికొద్దిసేపట్లో చంద్రబాబు విడుదల అయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-10-31T14:52:09+05:30 IST