Share News

Bhanu Prakash Reddy : పార్వేటి మండపం కూల్చివేత నిర్ణయంపై టీటీడీ ఈఓకు లీగల్ నోటీస్ పంపాం

ABN , First Publish Date - 2023-11-07T13:00:31+05:30 IST

పార్వేటి మండపం కూల్చేవేయాలని నిర్ణయం తీసుకోవడంపై నిన్ననే టీటీడీ ఈఓకు లీగల్ నోటీస్ పంపామని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన పార్వేటీ మండపాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న అందరిపైనా వారం రోజుల్లో కోర్టులో కేసు వేయనున్నామన్నారు.

Bhanu Prakash Reddy : పార్వేటి మండపం కూల్చివేత నిర్ణయంపై టీటీడీ ఈఓకు లీగల్ నోటీస్ పంపాం

తిరుమల : పార్వేటి మండపం కూల్చేవేయాలని నిర్ణయం తీసుకోవడంపై నిన్ననే టీటీడీ ఈఓకు లీగల్ నోటీస్ పంపామని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన పార్వేటీ మండపాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేయాలని నిర్ణయం తీసుకోవటం వెనుక ఉన్న అందరిపైనా వారం రోజుల్లో కోర్టులో కేసు వేయనున్నామన్నారు. టీటీడీ ఈవో చాలెంజ్ చేశారు. పార్వేటీ మండపం వద్ద చర్చకు రమ్మంటూ టీటీడీ ఈవో ఛాలెంజ్ చేశారు కాబట్టే వచ్చామని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఈవో రాజకీయ నాయకుడిలా ఛాలెంజులు విసరటం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలా జరగదని టీటీడీ ఈవో హామీ ఇవ్వాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి బీజీపీ రాష్ట్ర అధ్యకురాలు పురందేశ్వరి ఈరోజు లేఖ రాశారని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-07T13:00:32+05:30 IST