Avinash reddy: విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు.. ఎస్పీకి కీలక సమాచారం...

ABN , First Publish Date - 2023-05-22T06:18:06+05:30 IST

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (YS Viveka case) విచారణకు హాజరవకుండా తప్పించుకుంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash reddy) అరెస్టుకు సీబీఐ (CBI) సిద్ధమైంది.

Avinash reddy: విశ్వభారతి హాస్పిటల్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు.. ఎస్పీకి కీలక సమాచారం...

కర్నూలు: మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (YS Viveka case) విచారణకు హాజరవకుండా తప్పించుకుంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash reddy) అరెస్టుకు సీబీఐ (CBI) సిద్ధమైంది. అవినాష్ రెడ్డి నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌ వద్ద ఉంటుండడంతో సీబీఐ అధికారులు, పోలీసులు సోమవారం ఉదయమే అక్కడకు చేరుకున్నారు. అవినాష్ అరెస్టుపై కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఆస్పత్రి గేటు వద్ద వైసీపీ శ్రేణులు మోహరించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను వెనక్కి పంపుతున్నారు. కాగా తల్లి శ్రీలక్ష్మీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి అవినాష్ రెడ్డి అక్కడే ఉంటున్నారు.

మీడియాపై మరోసారి దాడి...

సీబీఐ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో వైసీపీ కార్యకర్తలు హాస్పిటల్ వద్ద వీరంగం సృష్టించారు. సీబీఐ అధికారుల వాహనాలు వెళ్లకుండా ఆటంకాలు సృష్టించారు. అంతకుముందు కవరేజీ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన మీడియా సిబ్బందిపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. హాస్పిటల్ వద్ద వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులతో వాగ్వాదానికి పాల్డడడంతోపాటు దాడికి పాల్పడ్డారు. హాస్పిటల్ దగ్గరకు వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. పలు కెమెరాలు ధ్వంసమయ్యాయి. సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోతారా లేదా అంటూ మూకుముడి దాడి చేశారు. కాగా మీడియాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.

కాగా సోమవారం కూడా విచారణకు హాజరుకాలేనంటూ ఎంపీ అవినాష్ రెడ్డి తన లాయర్ల ద్వారా సీబీఐకి సమాచారమిచ్చారు. తల్లి అనారోగ్యం దృష్యా హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-22T06:37:01+05:30 IST