CEC : ఏపీలో ఓట్ల గల్లంతుపై సీఈసీ సీరియస్

ABN , First Publish Date - 2023-07-21T12:07:57+05:30 IST

ఏపీలో ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఓట్ల గల్లంతుపై సీఈసీకి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. వెలగపూడి ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని సీఈసీ హామీ ఇచ్చింది.

CEC : ఏపీలో ఓట్ల గల్లంతుపై సీఈసీ సీరియస్

ఢిల్లీ : ఏపీలో ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఓట్ల గల్లంతుపై సీఈసీకి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. వెలగపూడి ఫిర్యాదుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతామని సీఈసీ హామీ ఇచ్చింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని ఫిర్యాదులో వెలగపూడి రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి, బీఎల్‌ఓల పైన వెలగపూడి ఫిర్యాదు చేశారు. బూతు లెవెల్ అధికారులు పూర్తిగా అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారని ఆరోపించారు. 2019 నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని వెల్లడించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని వెలగపూడి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-21T13:41:44+05:30 IST