Chandrababu news: చంద్రబాబుకు ఏసీబీ కోర్టులోనూ దక్కని ఊరట

ABN , First Publish Date - 2023-09-27T17:03:18+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టులోనూ నిరాశే ఎదురైంది. చంద్రబాబు పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్, రిమాండ్ పిటిషన్‌లపై విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేస్తున్నట్టు విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించింది.

Chandrababu news: చంద్రబాబుకు ఏసీబీ కోర్టులోనూ దక్కని ఊరట

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులోనూ నిరాశే ఎదురైంది. చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్, రిమాండ్ పిటిషన్‌లపై విచారణ అక్టోబర్ 4కి వాయిదా వేస్తున్నట్టు విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

మరోవైపు చంద్రబాబును మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్ల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (IRR Case) హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ ఈనెల 29కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ప్రకటించింది.


కాగా సుప్రీంకోర్టులోనూ చంద్రబాబుకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన విషయం తెలిసిందే. వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ కోసం ఎంతో ఉత్కంఠగా నెలకొన్నప్పటికీ మరో వారంపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఏపీ హైకోర్ట్ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-27T17:10:13+05:30 IST