Chandrababu : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2023-10-11T12:04:08+05:30 IST
ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి : ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. పిటిషనర్ అభ్యర్థనపై సూచనలు తీసుకోవాలని సీఐడీ, హోంశాఖ లాయర్లను హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని విచారణకు సహకరిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. విచారణను హైకోర్టు 12 గంటలకు వాయిదా వేసింది.