Kanna joined TDP: టీడీపీలో కన్నా ఎందుకు చేరారో చెప్పిన చంద్రబాబు

ABN , First Publish Date - 2023-02-23T16:14:34+05:30 IST

మాజీమంత్రి కన్నా లక్ష్మినారాయణ (Kanna Lakshminarayana) టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు..

Kanna joined TDP: టీడీపీలో కన్నా ఎందుకు చేరారో చెప్పిన చంద్రబాబు

గుంటూరు: మాజీమంత్రి కన్నా లక్ష్మినారాయణ (Kanna Lakshminarayana) టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి చంద్రబాబు (Chandrababu) ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీలో కన్నా చేరడం శుభపరిణామమని కొనియాడారు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి అని కితాబిచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆయనను విభిన్న పదవుల్లో చూశానని గుర్తుచేశారు. ఏపీ రాజకీయాల్లో కన్నాకు ప్రత్యేక స్థానం ఉందని, హుందాతనం, పద్ధతి, నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయనంటూ పొగడ్తలు కురిపించారు. సిద్ధాంతం కలిగిన రాజకీయ నాయకుల్లో కన్నా ఒకరని చంద్రబాబు తెలిపారు. టీడీపీతోనే ఏపీ అభివృద్ధని భావించి కన్నా టీడీపీలోకి వచ్చారని తెలిపారు. అమరావతే రాజధానిగా ఉండాలని కన్నా భావిస్తున్నారని పేర్కొన్నారు.

టీడీపీలోకి కన్నా

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ (TDP)లో చేరారు. ఆయనతో పాటు గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు (Nagaraju), తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌ (Venkatesh Yadav), మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ (SM Nizamuddin) తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాదరణ మెండుగా ఉంటుందని.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికను వారంతా స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-02-23T16:20:16+05:30 IST