Home » Kanna Lakshminarayana
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్‌లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.
సత్తెనపల్లి(Sathenapalli)లో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) కార్యాలయం వద్ద అర్ధరాత్రి యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఆఫీస్ వాచ్‌మెన్(Watchman)పై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం తగలపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దాడితో భయపడిన వాచ్‌మెన్ కొండలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పలు కుట్రలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సభ వేదిక కూల్చేందుకు వైసీపీ కుట్రకు తెరదీసింది.
Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్‌ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సత్తెనపల్లిలో ఔదార్యం చూపించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సత్తెనపల్లి ఆర్టీసీ డిపో బస్సులు వెళ్లాయి. దీంతో బస్సులు లేక ప్రయాణికులు రోడ్లపై ఎండలో పడిగాపులుగాస్తున్నారు.
సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) ఆరోపించారు.
Andhrapradesh: బ్రిటీష్ వారికంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారం పేరుతో భారత్‌కు వచ్చి, సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు.
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు.
ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.
Andhrapradeshh: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రచారంపై వైసీపీ రాళ్ల దాడిని మాజీ మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు.