Share News

Chinta Mohan: టీటీడీ పాలకమండలిపై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-06T13:12:30+05:30 IST

టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి తాండవిస్తోంది. గతంలో మునిరెడ్డి అనే టీటీడీ చీఫ్ ఇంజనీర్ తీవ్ర అవినీతికి పాల్పడటంతో

Chinta Mohan: టీటీడీ పాలకమండలిపై చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి: టీటీడీ పాలకమండలిపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan) ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి తాండవిస్తోంది. గతంలో మునిరెడ్డి అనే టీటీడీ చీఫ్ ఇంజనీర్ తీవ్ర అవినీతికి పాల్పడటంతో కాళ్లు చేతులు పని చేయనిస్థితికి పోయారు. ఆ విషయం ప్రస్తుతం ఉన్న వారు గుర్తు పెట్టుకోవాలి. అంచనాలు 50 శాతం పెంచారు. ప్రతి టెండర్‌లో 8 నుంచి 20 శాతం వరకు కమిషన్లు తీసుకుంటున్నారు. ప్రతి బోర్డు మీటింగ్‌లో వందల కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నారు. గోవిందరాజస్వామి సత్రాలను కొట్టేసి, అక్కడ కొత్తగా రూ.600 కోట్లతో కొత్తగా ఎందుకు సత్రాలను నిర్మించాలనుకుంటున్నారు?, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా అవినీతి తాండవిస్తోంది. బీజేపీ విజయం ఈవీఎంలను రిమోట్ ద్వారా ఆపరేట్ చేసి తీసుకున్నవే. ఊరికి దూరంగా ఈవీఎంలను పెట్టడం తగదు. ఓటర్ లిస్టులో మార్పులు చేర్పుల అధికారం రెవిన్యూ విభాగానికి ఉండాలి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించటం తగదు.’’ అని హితవు పలికారు.

Updated Date - 2023-12-06T13:12:32+05:30 IST