AP BJP: ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్
ABN , First Publish Date - 2023-09-05T17:17:30+05:30 IST
ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుమతాన్ని కించపరిచిన ఉదయనిధి స్టాలిన్ సిఫార్సు చేసిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని టీటీడీ పాలకమండలిలో
తిరుపతి: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు ఉదయినిధి స్టాలిన్‌పై (Udhayanidhi Stalin) తిరుపతి ఎస్పీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉదయనిధి స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుమతాన్ని కించపరిచిన ఉదయనిధి స్టాలిన్ సిఫార్సు చేసిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని టీటీడీ పాలకమండలిలో (TTD) సభ్యున్ని చేశారని తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ ప్రతిపాదించిన బాలసుబ్రహ్మణ్యం పళని స్వామిని తక్షణం టీటీడీ పాలకమండలి నుంచి సీఎం జగన్ (CM jagan) తొలగించాలని కోరారు. తమిళ భగవద్గీతను ఉదయనిధికి పంపుతున్నామని.. భగవద్గీతను చదివాక ఆయన తప్పకుండా తిరుమలకు వస్తారని పేర్కొన్నారు.