Home » Udayanidhi Stalin
తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించినట్టు అయింది. దిండిగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మెరీనా బీచ్(Marina Beach) సర్వీసు రోడ్డులో గస్తీ తిరుగుతున్న పోలీసులపై పీకలదాకా తాగిన ఓ జంట విరుచుకుపడింది. అర్థరాత్రి పూట ఉండకూడదని, త్వరగా ఇంటికి వెళ్లమంటూ సలహా ఇచ్చిన పుణ్యానికి ఆ జంట పోలీసులను దుర్భాషలాడింది.
సమైక్యతకు భంగం కలిగించేలా, తమిళ తాయి గేయంలో కొన్ని పంక్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కోట్లాది తమిళ ప్రజల మనస్సులను గాయపరిచిన గవర్నర్ ఆర్ఎన్.రవిని తక్షణం రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy Chief Minister Udayanidhi) ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో డ్రెస్ కోడ్ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ దాఖలైంది.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్‌పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు..
క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి కార్యక్రమంగా విరుదునగర్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుమట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. మరో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.