Share News

Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2023-10-31T07:42:58+05:30 IST

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది.

Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు (Devotees) వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న సోమవారం స్వామి వారికి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

కాగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chairman Bhumana Karunakar reddy) సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. నవంబరు 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. 7వ తేదీ అంకురార్పణ, 9వ తేదీ లక్ష కుంకుమ పూజ నిర్వహణ ఉంటుందని తెలిపారు. 10వ తేదీన ధ్వజారోహణంతో శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని.. 14వ తేదీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. 18 వతేది పంచమి తీర్థం ఉంటుందన్నారు. 9 కోట్ల రూపాయలతో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పుష్కరిణిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-31T07:42:58+05:30 IST