Chittoor Dist.: రోడ్డుపై ఏనుగు హల్ చల్..

ABN , First Publish Date - 2023-04-15T11:01:28+05:30 IST

చిత్తూరు జిల్లా: రోడ్డుపై ఏనుగు (Elephant) హల్ చల్ (Hull Chal) చేసింది. చిత్తూరు జిల్లా గుడియాత్తం రోడ్డుపై ఒంటరి ఏనుగు వీరంగం సృష్టించింది.

Chittoor Dist.: రోడ్డుపై ఏనుగు హల్ చల్..

చిత్తూరు జిల్లా: రోడ్డుపై ఏనుగు (Elephant) హల్ చల్ (Hull Chal) చేసింది. చిత్తూరు జిల్లా గుడియాత్తం రోడ్డుపై ఒంటరి ఏనుగు వీరంగం సృష్టించింది. దాదాపు గంటవరకూ రోడ్డుపై వెళ్ళే వాహనదారులు ఆగిపోయారు. పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగు గ్రామ సమీపంలోని గుడియాత్తం రోడ్డుపై ఈ ఘటన జరిగింది. పట్టపగలే ఓ ఒంటరి ఏనుగు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేసింది.

మూడు రోజులుగా ఈ ఒంటరి ఏనుగు మొసలిమడుగు, ఏటిగడ్డ, క్రిష్ణాపురం గ్రామ సమీప పంటపొలాలపై దాడులు చేస్తూ అటు రైతులను, ఇటు అటవీశాఖ అధికారులను కంటిమీద నిద్రలేకుండా చేసింది. మూడ్రోజులుగా రాత్రి పగలు తేడాలేకుండా భయబ్రాంతులకు గురిచేసింది. ఏనుగును అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టింది. చివరకు అడవిలోకి వెళ్లింది.

కాగా కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు గుంపు హల్చల్ చేసింది. పలమనేరు నుంచి గుడియాత్తం వెళ్లే రహదారిలో ఏనుగుల గుంపు రోడ్డుకు అడ్డంగా నిలబడి.. అటుగా వెళ్లే ప్రయాణికులకు భయాందోళన కలిగించాయి. రోడ్డుకు అటు ఇటు తిరుగుతూ గంటల కొద్దీ అక్కడే ఉండిపోయాయి. ఒక్కసారిగా ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవిలోకి తరమడానికి ప్రయత్నించారు. రోడ్డుపై వాహనాలు తిరిగే చోట.. జనసంచారం ఉండే ప్రాంతాల్లో ఏనుగుల గుంపు రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - 2023-04-15T11:01:28+05:30 IST