AP News: చిత్తూరులో వైభవంగా గంగమ్మ జాతర ప్రారంభం.. క్యూ కట్టిన భక్తులు

ABN , First Publish Date - 2023-05-16T09:25:48+05:30 IST

జిల్లాలో నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది.

AP News: చిత్తూరులో వైభవంగా గంగమ్మ జాతర ప్రారంభం.. క్యూ కట్టిన భక్తులు

చిత్తూరు: జిల్లాలో నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు తెల్లవారుజామున వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు జాతర వేడుకలను మొదలుపెట్టారు. వేకువజామున పొన్నియమ్మ గుడి నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. ఆపై భక్తజనం గంగమ్మకు మొక్కులు భక్తిశ్రద్ధలతో సమర్పించేందుకు క్యూకట్టారు. భక్తులు అమ్మవారికి పూజలు చేసి అంబలి సమర్పిస్తారు. అలాగే, గిరింపేట బజారు వీధి, కొంగారెడ్డిపల్లె, కట్టమంచి, మంగసముద్రం, ఓబనంపల్లె, మంగసముద్ర హౌసింగ్‌ కాలనీ, సంతపేటలోనూ గంగజాతర జరుగనుంది. జాతర మంటపాల వద్ద నగరపాలక అధికారులు పారిశుధ్యం, పోలీస్‌ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. బజారువీధి, రాములగుడి వీధి, చర్చివీధి, ఓటీకే రోడ్డు తదితర ప్రాంతాలతో పాటు పొన్నియమ్మగుడి వద్ద ట్రాఫిక్‌ కంట్రోల్‌ పాయింట్స్‌ ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం అమ్మవారి ప్రతిమలను కట్టమంచి చెరువుతో పాటు అందుబాటులో ఉండే జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. నడి వీధి గంగమ్మ జాతర సందర్భంగా ఓం శక్తి అమ్మవారి భక్తుల విన్యాసాలు, పాట కచ్చేరి, కేరళ డ్రమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి.

Updated Date - 2023-05-16T09:25:48+05:30 IST