Yuvagalam Padayatra: వి.కోటలో లోకేష్‌ను కలిసిన పట్టుగూళ్ల రైతులు
ABN , First Publish Date - 2023-01-30T10:49:02+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) 4వ రోజు సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది.
చిత్తూరు జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) 4వ రోజు సోమవారం ఉదయం పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. వి.కోటలో పట్టుగూళ్ల రైతులు లోకేష్‌ను కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే.. సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం జీఎమ్మార్ కళ్యాణ మండపంలో యువతతో లోకేష్ భేటీ అవుతారు. అనంతరం కృష్ణాపురం క్రాస్ వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది. రాత్రికి కృష్ణాపురం టోల్‌గేట్ సమీపంలో లోకేష్ బస చేస్తారు.
నేటి పాదయాత్ర ఇలా..
ఉదయం 8.45: వి.కోట మండలంలో అన్నవరంలోకి రాక
9.30: కారకుంట గ్రామం వద్ద రెడ్డి సామాజికవర్గంతో కలిసి నడక
10.10: పడిగలకుప్పం వద్ద సెరికల్చర్ రైతులతో కలిసి..
10.45: గంధారమాకులపల్లెలో వడ్డెర సామాజిక వర్గంతో మమేకమై వారినుంచి వినతుల స్వీకరణ
మధ్యాహ్నం 12.20: జీఎంఆర్ కల్యాణ మండపంలో యువతతో సమావేశం
1.35: వి.కోట కూరగాయల మార్కెట్‌లో రైతులతో ముఖాముఖి
2.15: వి.కోట హనుమాన్ ఆలయంలో పూజలు
2.30: వి.కోట పీఎంఆర్ కల్యాణ మండపంలో భోజనం
సాయంత్రం 4.40: వి.కోట ఆగా కల్యాణ మండపం ఎదురుగా ముస్లిం మైనారిటీలతో సమావేశం
రాత్రి 07.25: కృష్ణాపురం మీదుగా పాదయాత్ర
07.55: టోల్‌గేట్ సమీపంలో రాత్రి బస
కాగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం మండల కేంద్రమైన శాంతిపురంలో ఉదయం ప్రారంభమై రామకుప్పం మండలం, చెల్దిగానిపల్లెలో పూల రైతులతో సమావేశం తర్వాత సాయంత్రం 7.15 గంటలకు ముగిసింది. ఆయా సందర్భాల్లో లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే...
ప్రజలకు భరోసా..
టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థి దశనుంచే మహిళల గొప్పదనం, త్యాగాలు, కష్టాలు తెలిసేవిధంగా ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతాం. మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తాం. పాడి, పూలు, కూరగాయల రైతుల పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగేలా ప్రణాళిక సద్ధం చేస్తాం. ఉద్యాన పంటలకు బలోపేతం చేస్తాం. హంద్రీ నీవాను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం. సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్‌ను ఉపాధి హామీ పథకానినికి అనుసంధానం చేస్తాం. ధరలు తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం.
బతుకు కూల్చేశారన్నా..
‘చంద్రన్న అన్నా, మీరన్నా నాకు అభిమానం. మొదటినుంచీ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నా. దీన్ని మనసులో పెట్టుకున్న వైసీపీ నాయకులు రాత్రికి రాత్రి నేను అద్దెకు తీసుకున్న పాత మార్కెట్టు గది తాళం పగులగొట్టి, సామాన్లంటినీ బయట పడేశారు. బీగం బిగించారు. ఇప్పుడు నా బతుకు బజారున పడింది’ అంటూ శాంతిపురంలో మహిళలతో జరిగిన ముఖాముఖిలో కుప్పం పట్టణం కొత్తపేటకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు జయమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.. ఆమెను అక్కున చేర్చుకున్న లోకేశ్, టీడీపీ అధికారంలోకి రాగానే బతుకుతెరువు చూపిస్తామని, అదే గదిలో ఉండడానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
తాళిబొట్లు తాకట్టుపెడుతున్నారు..
సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నావు. ఎటు చూసినా బెల్టు షాపులు, ఊరూపేరూ లేని బ్రాండ్లతో కల్తీ మద్యాలు. నీ బినామీలే మద్యం తయారుచేసి అమ్ముతున్నారు. మద్యం పాలసీని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చావు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు? నీ మద్యం పాలసీ వల్ల తల్లులు వారి పుస్తెలు తాక ట్టు పెడుతున్నారు.
అబద్ధాల జ‘గన్’
మహిళలపై అత్యాచారాలు జరిగితే దిశ చట్టం ద్వారా 25 రోజుల్లో ఉరేస్తాం అన్నావు. ఒక్క కామాంధుడికైనా ఉరిశిక్ష పడిందా? మహిళలపై అఘాయిత్యాలు జరిగితే గన్‌కంటే ముందు జగన్ వస్తాడన్నావు, ఏదీ ఎక్కడ? నియోజకవర్గంలో ముగ్గురు యువతులపై అత్యాచారాలు జరిగాయి. నీ వలంటీర్లే ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇప్పటివరకూ వారిపై చర్యలు తీసుకోలేదు. చివరకు చంద్రబాబు పర్యటనను చూసేందుకు అభిమానంతో వచ్చిన మహిళలపై అటెంప్ట్ టూ మర్డర్ కేసులు పెట్టావు.
ఇవేం ధరలయ్యా?..
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పెట్రోలు ధరల్లో చాలా వ్యత్యాసముంది. కుప్పం ప్రజలు కర్ణాటక బార్డర్‌కు వెళ్లి బండికి పెట్రోలు కొట్టించుకుంటున్నారు. లిక్కర్ కోసం కూడా కర్ణాటకకు పరుగులు తీస్తున్నా
రు. ఇక్కడికంటే క్వార్టర్ ధర వంద రూపాయలు అక్కడ తక్కువంట. పైగా ఏపీ లిక్కర్ తాగితే ప్రాణానికీ ప్రమాదమే. ఆర్టీసీ ఛార్జీలు సహా అన్నీ పెంచేశాడు. ధరల బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టాడు.
రైతుల మీద అప్పులా?
జగన్‌రెడ్డికి అసలు పాడి పరిశ్రమపై అవగాహన లేదు. చిత్తూరు, ఒంగోలు డైరీలను అమూల్‌కు తాకట్టు పెట్టాడు. మూడువేల కోట్ల అప్పు రైతులమీద తీసుకుని కట్టబెట్టాడు. పాడి రైతులు, పూల రైతులు కూడా జగన్‌రెడ్డి పాలనలో కుదేలవుతున్నారు.
పాదయాత్ర డైరీ మూడో రోజు..