Chittoor: చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై డిప్యూటీ సీఎం విమర్శలు..
ABN , First Publish Date - 2023-10-18T14:01:15+05:30 IST
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భోజనం పంపిస్తున్నది నారా భువనేశ్వరేకదా.. ఆమె అన్నంలో ఏదో కలిపి..
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu).. ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) నారాయణస్వామి (Narayanaswamy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు (Comments) చేశారు. చంద్రబాబుకు భోజనం పంపిస్తున్నది నారా భువనేశ్వరేకదా.. ఆమె అన్నంలో ఏదో కలిపి చంద్రబాబును చంపే ప్రయత్నం చేస్తున్నారన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. భువనేశ్వరి (Bhuvaneswari), పురంధేశ్వరి (Purandeswari) ఇద్దరూ ఎన్టీఆర్ (NTR) బిడ్డలే కాబట్టి ఆయన మృతికి కారణమైన చంద్రబాబుపై కసి ఉండి ఉండవచ్చునన్నారు. ఆ కసితోనే చంద్రబాబును చంపేసి లోకేష్ (Lokesh)ను సీఎం చేయాలని చూస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టులు ఇప్పుడే కళ్లు తెరుచుకున్నాయని, చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయలేకపోతున్నారని నారాయణస్వామి అన్నారు.