Share News

Tirupati: తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు

ABN , First Publish Date - 2023-10-29T07:11:50+05:30 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3:15 గంటలకు టీటీడీ అధికారులు స్వామివారి ఆలయం తలుపులు తెరిచారు. పాక్షిక చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి.. భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు.

Tirupati: తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆదివారం తెల్లవారుజాము 3:15 గంటలకు టీటీడీ అధికారులు స్వామివారి ఆలయం తలుపులు తెరిచారు. పాక్షిక చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి.. భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. పుణ్యాహవచనం, శుద్ధి తర్వాత దర్శనాలకు అనుమతి ఇచ్చారు.

కాగా శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయం తలుపులను టీటీడీ అధికారులు మూసివేశారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచారు. అర్థరాత్రి 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం నేపథ్యంలో రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులను అధికారులు మూసివేశారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందే.. ఆలయం తలుపులు మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు.

Updated Date - 2023-10-29T07:11:50+05:30 IST