CI Swarnalatha: సీఐ స్వర్ణలతను కేసు నుంచి తప్పించాలంటూ ఇద్దరు వైసీపీ నేతల ఒత్తిడి!

ABN , First Publish Date - 2023-07-08T22:50:55+05:30 IST

విశాఖ సీఐ స్వర్ణలత కేసులో వైసీపీకి చెందిన ఇద్దరు పెద్దలు చివరిదాకా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా... పోలీసు శాఖకే ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో ఆమెను రక్షించేందుకు ఎందుకంత ప్రయత్నం చేశారు.

CI Swarnalatha: సీఐ స్వర్ణలతను కేసు నుంచి తప్పించాలంటూ ఇద్దరు వైసీపీ నేతల ఒత్తిడి!

విశాఖ సీఐ స్వర్ణలత కేసులో వైసీపీకి చెందిన ఇద్దరు పెద్దలు చివరిదాకా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా... పోలీసు శాఖకే ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో ఆమెను రక్షించేందుకు ఎందుకంత ప్రయత్నం చేశారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పటికీ కేసులో తీవ్రత లేకుండా చూడాలని.. సాధ్యమైతే తప్పించాలని ఒత్తిడి చేశారా.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అనే వస్తోంది.

కోటి విలువైన రూ. 2వేల నోట్లు ఇస్తే.. రూ. 90 లక్షల విలువైన రూ. 500 నోట్లు ఇస్తామంటూ రిటైర్డ్ నేవీ అధికారులను మోసం చేసే ప్రయత్నం చేసి వారి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైన విశాఖ సీఐ స్వర్ణలత వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖతోపాటు.. అధికార పార్టీలోనూ హాట్ టాపిక్‌ గా మారింది.


కాగా.. విశాఖపట్నంలో (Visakhapatnam) మరో దందా వెలుగులోకి వచ్చింది. రూ. 90 లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను ఓ ముఠా మోసం చేసింది. ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత (CI Swarnalatha) నాయకత్వం వహించారు. ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సీఐగా స్వర్ణలత పనిచేస్తున్నారు. రూ. 90 లక్షల్లో సీఐ స్వర్ణలత రూ. 20 లక్షలు నొక్కేశారు. సీఐ స్వర్ణలత తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా స్వర్ణలత ఉన్నారు. రిటైర్డ్ నేవల్ ఆఫీసర్స్ కొల్లి శ్రీను, శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు.

Updated Date - 2023-07-08T22:54:03+05:30 IST