CID Advocate: పోలీసు కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు.. రేపు కోర్టుకు వివరిస్తాం

ABN , First Publish Date - 2023-09-24T19:41:28+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోలీసు కస్టడీ పొడిగించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరామని సీఐడీ తరపున న్యాయవాది (CID Advocate) వివేకానంద అన్నారు.

CID Advocate: పోలీసు కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు.. రేపు కోర్టుకు వివరిస్తాం

విజయవాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోలీసు కస్టడీ పొడిగించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కోరామని సీఐడీ తరపున న్యాయవాది (CID Advocate) వివేకానంద అన్నారు. మెకానికల్ గా ఇవ్వనని, పిటిషన్ వేస్తే పరిశీలన చేస్తానని న్యాయమూర్తి తెలిపారు. సీఐడీ తరపున వివేకానంద, చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.


"పోలీసు కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు. వీడియోలో చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడారు. విచారణ జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. అక్టోబర్ 5 వరకు జ్యూడిషియల్ రిమాండ్ వేశారు. కస్టడీ పిటీషన్ రేపు వేసే అంశం పరిశీలిస్తాం. విచారణకు సహకరించలేదని మా అధికారులు చెప్పారు. రేపు కోర్టుకు ఈ అంశాలు వివరిస్తాం. రేపు చంద్రబాబు బెయిల్ పిటీషన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసులో అక్రమాలపై విచారణ సాగుతుంది." అని సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద అన్నారు. విచారణ రేపటికి వాయిదా వేశారు.

Updated Date - 2023-09-24T19:43:13+05:30 IST