CM Jagan: ఎంపిక చేసిన వారే మాట్లాడాలట... జగన్ రాకతో కోనసీమ అష్టదిగ్బంధనం

ABN , First Publish Date - 2023-08-08T10:30:21+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అష్టదిగ్బంధనంలోకి వెళ్లిపోయింది.

CM Jagan: ఎంపిక చేసిన వారే మాట్లాడాలట... జగన్ రాకతో కోనసీమ అష్టదిగ్బంధనం

కోనసీమ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy0పర్యటన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అష్టదిగ్బంధనంలోకి వెళ్లిపోయింది. కోనసీమలో ఎక్కడికక్కడ వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. వరద బాధితులు ఎవరూ జగనన్నను కలవకుండా పోలీసులు కట్టుదిట్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ పర్యటించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఎవ్వరూ లోపలికి వెళ్ళకుండా పోలీసు వలయంలా మారిపోయింది. జగన్‌కు బాధితుల సమస్యలు వినిపించకుండా ఉండేందుకు ఎంపిక చేసిన వారితో మాత్రమే ముఖాముఖి నిర్వహించేలా వైసీపీ వర్గాలు, ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


పర్యటన వివరాలు ఇవే...

సీఎం జగన్ ఈరోజ ఉదయం రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిధి గృహం నుంచి బయలుదేరి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ముమ్మిడివరం మండలం గురజాపులంకు చేరుకోనున్నారు. తానేలంక, రామాలయంపేట గ్రామాలకు చేరుకోనున్న జగన్.. అక్కడి వరద బాధితులతో సమావేశంకానున్నారు. అనంతరం అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురులో వరద బాధితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:10 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

Updated Date - 2023-08-08T10:30:21+05:30 IST