BYJUs: అనంత సభలో బైజూస్‌పై జగన్ గొప్పలు.. పట్టించుకోని విద్యార్థులు
ABN , First Publish Date - 2023-04-26T14:47:04+05:30 IST
అనంతపురం జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి నిధుల విడుదల సందర్భంగా బైజూస్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పలకు పోయారు.
అమరావతి: అనంతపురం జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి నిధుల విడుదల సందర్భంగా బైజూస్‌పై (BYJUS)ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) గొప్పలకు పోయారు. బైజూస్ ద గ్రేట్ అని.. చాలా బాగా సేవలు అందిస్తోందని అన్నారు. అయితే వాస్తవానికి బైజూస్ ఇస్తున్న కంటెంట్‌ను విద్యార్థులు పట్టించుకోవడం లేదు. ఎనిమిదవ తరగతి విద్యార్థులకే ట్యాబ్‌లు ఇచ్చేస్తున్నారు. అయితే బైజూస్ కంటెంట్‌ను పట్టించుకోకుండా టీచర్లు ఇచ్చే నోట్స్‌పై విద్యార్థులు ఆధారపడుతున్నారు. బైజూస్ కంటెంట్ వద్దని టీచర్లు కూడా సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా సొంత కంటెంట్ తయారీపై దృష్టిపెట్టింది. దీంతో వచ్చే ఏడాదికి బైజూస్ ఒప్పందం లేనట్టే అని తెలుస్తోంది. అయితే బైజూస్ ద్వారా గొప్ప మార్పు వచ్చిందంటూ సీఎం సొంత డబ్బా కొట్టుకోవడంపై టీడీపీ నేతలు, విద్యార్థి సంఘాలు, పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రసంగంలో సీఎం జగన్ అబద్దాలు చెప్పారని మండిపడుతున్నారు. బైజూస్‌పై సీఎం చెప్పిన వ్యాఖ్యలు అవాస్తవాలు అని, బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులు పట్టించుకోవడం లేదని, టీచర్లు ఇచ్చే నోట్స్‌పైనే ఆధార పడుతున్నారన్నారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి ప్రసంగంలో... బైజూస్‌తో విద్యారంగంలో పెను మార్పులు వచ్చాయని చెప్పడం పట్ల విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.