Congress: ‘దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది’.. బీటెక్ రవి అరెస్ట్‌పై తులసిరెడ్డి
ABN , First Publish Date - 2023-11-15T12:21:31+05:30 IST
టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్‌పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్‌పై (TDP Leader Btech Ravi Arrest) కాంగ్రెస్ నేత తులసిరెడ్డి (Congress Leader Tulasi Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీటెక్ రవి అరెస్ట్ పిరికిపంద చర్య అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి ఓటమి ఫోబియా పట్టుకుందన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుంది ప్రభుత్వ వాలకం అంటూ ఎద్దేవా చేశారు. జనవరి 25న కడప విమానాశ్రయం వద్ద చిన్న తోపులాట జరిగితే నవంబర్ 14న కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద రాత్రి సినిమా ఫక్కీలో అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల నాటికి రాజకీయ ప్రత్యర్థులు అందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధి ముఖ్యమంత్రికి ఉన్నట్లుందని మండిపడ్డారు. ఇది సాధ్యం కాదని.. మహామహా నియంతలే కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. ఇప్పటికైనా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.