Vande Bharat : విమానం వద్దని ‘వందేభారత్’లో సీఎస్ ప్రయాణం.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-04-09T21:44:10+05:30 IST
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఆదివారం తిరుపతి నుంచి ...
రేణిగుంట: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి (Jawahar Reddy) ఆదివారం తిరుపతి నుంచి గుంటూరుకు వందేభారత్ రైల్లో ప్రయాణించారు. తిరుపతి నుంచి సికింద్రాబాదుకు తొలిసారిగా బయల్దేరుతున్న వందేభారత్‌లోనే ప్రయాణించాలని ఆయన విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. జిల్లా పర్యటన ముగించుకుని ఆయన మధ్యాహ్నం తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కోచ్ చేరుకోగా.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy), డీఆర్‌ఎం వెంకటరమణారెడ్డి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేసీ బాలాజి, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.
వెయిటింగ్ లిస్టులో 50 మంది
తిరుపతి రైల్వేస్టేషన్ (Tirupati Railway Station) నుంచి తొలిసారిగా బయల్దేరుతున్న ఈ రైలు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. దాదాపు 50మంది వెయిటింగ్ లిస్టులో ఉండటం గమనార్హం. మొత్తం 598మంది పూర్తి సామర్థ్యంతో మధ్యాహ్నం 3.15 గంటలకు రైలు బయల్దేరింది. టిక్కెట్ చెకింగ్ ఆఫీసర్లగా తిరుపతికి చెందిన నలుగురు మహిళలు అనిత, శెల్వి, భారతి, రమణమ్మలను కేటాయించారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును(Vande Bharat Express train between Secunderabad and Tirupati) దేశ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం ప్రారంభించనున్నారు.
వందేభారత్ ఎక్కడెక్కడ ఆగుతుందంటే..
సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయి.. నల్గొండ, ఒంగోలు, నెల్లూు స్టేషన్లలో ఆల్టింగ్ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు నెంబర్ (20701) సికింద్రాబాద్ లో ఉదయం 6 గంటలకు మొదలై మధ్యాహ్నం వరకు 2.30 వరకు తిరుపతిలో చేరుకుంటుంది. తర్వాత తిరుపతి నుంచి సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15కి స్టార్ట్ అయి రాత్రి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
సికింద్రాబాద్ నుంచి వివిధ స్టేషన్లకు ధరలు ఇలా..
సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.470
సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.1075
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.1270
సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.1680
ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ఛార్జీలు
సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900
సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.1620
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు - రూ.2045
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు - రూ.2455
సికింద్రాబాద్ నుంచి తిరుపతి - రూ.3080