AP Assembly : టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చిన డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2023-09-22T10:24:02+05:30 IST

ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చారు. టీడీపీ సభ్యులు గ్రామాల్లో కుక్కల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.

AP Assembly : టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చిన డిప్యూటీ సీఎం

అమరావతి : ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను ఊర కుక్కలతో పోల్చారు. టీడీపీ సభ్యులు గ్రామాల్లో కుక్కల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వూరకుక్కలు మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారంటూ ధ్వజమెత్తారు. స్పీకర్ చైర్ వద్దకు రాకుండా టీడీపీ ఎమ్మెల్యేలను పోడియం సర్కిల్ వద్ద మార్షల్స్ నిలిపి వేశారు. చంద్రబాబును బేషరతుగా విడుదల చేయాలని స్పీకర్‌ను ఎలా అడుగుతారని మంత్రి కాకాని ప్రశ్నించారు.

ఏపీ అసెంబ్లీ ప్రారంభమయ్యీ అవగానే టీడీపీ ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దరిద్రపు పాలన పోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము వూరుకోబోమని అంబటి హెచ్చరించారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. అయినా కూడా టీడీపీ సభ్యులు తగ్గలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగిస్తున్నారు. ప్లకార్డులను వారి వద్ద నుంచి తీసుకోవాలని స్పీకర్‌ను మంత్రి జోగి రమేష్ కోరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. సైకో పాలన పోవాలని నినాదాలు చేశారు. వాయిదా అనంతరం కూడా విజిల్స్ వేసి రచ్చ చేశారు.

Updated Date - 2023-09-22T10:24:02+05:30 IST