AP News: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను...
ABN , First Publish Date - 2023-05-07T11:51:55+05:30 IST
జిల్లాలో అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో దారుణం చోటు చేసుకుంది.
అంబేద్కర్ కోనసీమ: జిల్లాలో అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడుతో కలిసి భార్య.. కట్టుకున్న భర్తను పొట్టనపెట్టుకోవడం కలకలం రేపుతోంది. గంగలకుర్రు అగ్రహారంకు చెందిన రాయుడు రవిశంకర్ వద్ద 2016లో ఆదిలాబాద్‌కు చెందిన గజానంద్ డ్రైవర్‌గా పనిచేశాడు. రవిశంకర్‌కు మసాలా వ్యాపారం, వర్మి కంపోస్ట్ ఎరువు తయారీ వ్యాపారంలో నష్టం రావడంతో చివరకు స్వగ్రామం అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో రాయల్ ఎన్ ఫీల్డ్ స్పెర్ పార్ట్స్ వ్యాపారం ప్రారంభించారు. ఆదిలాబాద్‌లో కార్ డ్రైవర్‌గా పనిచేసిన గజానంద్‌ను అతని భార్య ఊర్మిళను కూడా తనవద్దే పనిలో పెట్టుకున్నారు. ఈ క్రమంలో గజానంద్ భార్య ఊర్మిళ.. రవిశంకర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడు రవిశంకర్‌తో కలి భర్తను హత్య చేసి ఆపై వర్మీ కంపోస్టు షేడ్‌లో పాతిపెట్టింది. గత ఏడాది నవంబరు 23న ఈ ఘటన జరిగింది. అయితే గజానంద్ కనిపించకపోవడం.. ఊర్మిళ వేరే వాళ్ళతో తీరుగుతుండటంతో అనుమానం వచ్చి గజానంద్ తండ్రి శివాజీ హైదరాబాదులోని అబ్దుల్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్టరీ కేసుగా నమోదు చేసిన పోలీసులు రవిశంకర్, ఊర్మిళలను విచారించగా అసలు నిజయం బయటపడింది. వీరిద్దరు కలిసి గజానంద్‌ను హత్య చేసినట్లు విచారణలో వెల్లడింది. నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.