Kakinada: సముద్రంలో పడవ బోల్తా..ఇద్దరు మత్స్యకారుల గల్లంతు
ABN , First Publish Date - 2023-11-21T13:42:26+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో ప్రమాదం జరిగింది. సముద్రంలో నాటు పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న (సోమవారం) సాయంత్రం నాటు పడవలో ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు.
తూర్పుగోదావరి జిల్లా: కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో ప్రమాదం జరిగింది. సముద్రంలో నాటు పడవ బోల్తాపడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న (సోమవారం) సాయంత్రం నాటు పడవలో ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. సముద్రంలో గాలి తీవ్రత, అలల తాకిడి అధికంగా ఉండడంతో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. గల్లంతైన ఇద్దరు సత్తిరాజు, మైలపల్లి కృపదాస్‌గా గుర్తించారు. దీంతో మత్స్యకారుల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరి ఆచూకి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టారు.
నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాకినాడ వాకలపూడి బీచ్ దగ్గర నుంచి ఫైబర్ బోట్‌లో ఐదుగురు మత్స్యాకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. చేపల వేట పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రంలో ఈదురు గాలులు ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. మరో రెండు గంటల్లో ఒడ్డుకు చేరుకుంటారనగా అలలతాకిడి, గాలి తీవ్రతకు బోటు బోల్తాపడింది. అందులో ముగ్గురు బోటును పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.