Chintamohan: చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ హస్తం
ABN , First Publish Date - 2023-09-14T10:02:54+05:30 IST
టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకు పంపడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదన్నారు.
రాజమహేంద్రవరం: టీడీపీ చీఫ్ చంద్రబాబును (TDP Chief Chandrababu) జైలుకు పంపడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Former Union Minister Chinta Mohan) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదన్నారు. ఏసీబీకి కోర్టు తీర్పు దారుణం.. తీర్పు సరిగ్గా లేదని మండిపడ్డారు. వేకువజామున జరిగిన చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ హస్తం ఉందని ఆరోపించారు. ఢిల్లీకి సంబంధం లేకుండా ఈ అరెస్టు జరగదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అసలు స్కాం కాదని అన్నారు. చంద్రబాబు తప్పు చేసి ఉండరని చెప్పుకొచ్చారు. ఇలా అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పనిచేయరన్నారు. సుప్రీం కోర్టులో చంద్రబాబుకు న్యాయం జరగడం ఖాయమని చింతా మోహన్ పేర్కొన్నారు.
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లొవచ్చు....
ప్రతిపక్షాలపై కక్ష సాధింపు సరికాదన్నారు. జగన్ లండన్ నుంచి వచ్చాక నవ్వుతూ ఇంటికి వెళ్ళారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో వసతులు...రక్షణ కూడా లేదని తెలిపారు. స్కిల్ కేసు కోర్టులో నిలవదని.. ఈ మధ్య కాలంలో జడ్జిమెంట్‌లు సరిగ్గా వుండడం లేదన్నారు. ప్రజల్లో కూడా అనుమానాలున్నాయని చెప్పారు. మొన్న చంద్రబాబుకు రిమాండ్ విధించిన జడ్జిమెంట్‌లో చాలా లోటుపాట్లు ఉన్నాయన్నారు. న్యాయమూర్తులు కొందరు అవినీతి కేసుల్లో చట్టాలు సరిగ్గా చదవడం లేదని చెప్పుకొచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో పార్లమెటు.. అసెంబ్లీకి డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని.. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనుందని అన్నారు. ఏపీలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళవచ్చని చింత మోహన్ వ్యాఖ్యలు చేశారు.