MLA Gorantla: చెత్త మీద పన్నువేసిన చెత్త సీఎం జగన్...
ABN , First Publish Date - 2023-04-13T10:21:35+05:30 IST
తూ.గో. జిల్లా: ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (MLA Gorantla Butchiah Chowdhary) తీవ్రస్థాయిలో విమర్శించలు గుప్పించారు.
తూ.గో. జిల్లా: ఏపీ సీఎం జగన్ (CM Jagan)పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి (MLA Gorantla Butchiah Chowdhary) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెత్త మీద పన్నువేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డని, అవసరానికి వాడుకుని అమ్మను చెల్లిని తరిమేశారన్నారు. కేసులలోంచి బయటపడడం కోసం ఢిల్లీలో బీజేపీ నాయకులు (BJP Leaders) కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ఎత్తు తగ్గించి బ్యారేజ్ స్థాయికి తీసుకువచ్చారని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లు ఎనిమిది సార్లు పెంచి ఇచ్చిన మాట తప్పారన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనే నాథుడే లేడని, రాష్ట్రంలో కౌలు రైతులకు అప్పు పుట్టే పరిస్థితి లేదన్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలు ఆడే ముఖ్యమంత్రి... పంచాయతీ నిధులు కబ్జా చేసి బ్లీచింగ్ కూడా లేని పంచాయతీలుగా మార్చారని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు.
కాగా రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతున్నదని గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ నియంతృత్వ పోకడలతో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, పోలీసు అధికారులు తమ తీరుమార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాండ్, లాండ్, మైనింగ్, వైన్‌లో జగన్ సరికొత్త దోపిడీకి తెరలేపారన్నారు. అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, పత్రికాస్వేచ్ఛను హరించడం నిత్యకృత్యంగా మారిందన్నారు. తన సొంత పత్రిక సాక్షి పేపర్, ఛానల్‌కు ప్రకటనల రూపంలో నిధులు సమకూర్చడానికే బటన్ నొక్కుడు అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదన్నారు. దీనిపై అధికారపార్టీ సర్పంచ్‌లు, జడ్పీటీసీలే తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
రాబోయే వర్షాకాలం ప్రారంభం నాటికి నగరంలో డ్రైన్లు నిర్మాణం చేపట్టడంతో పాటు ఇతర ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేకుంటే కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే గోరంట్ల హెచ్చరించారు. వైసీపీకి దమ్ముంటే కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయాల సాధారణ నిధులను కంబాలచెరువు చుట్టూ పై పై అందాల కోసం కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. అసలు అక్కడ ఎన్ని నిదులు ఖర్చు చేస్తున్నారో కూడా అధికారులు చెప్పడంలేదన్నారు. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే మహానాడును దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు అంకితమిస్తున్నామని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయన్నారు. వేమగిరి, కాతేరు వంటి ప్రదేశాలు మహానాడు నిర్వహణకు పరిశీలనలో ఉన్నాయని గోరంట్ల వ్యాఖ్యానించారు.