AP HighCourt: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
ABN , First Publish Date - 2023-12-05T14:05:21+05:30 IST
Andhrapradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజు నియంత్రణ మండలి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేసిన ప్రక్రియను ధర్మాసనం తోసిపుచ్చింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి (AP Government) హైకోర్టులో (AP HighCourt) చుక్కెదురైంది. ఫీజు నియంత్రణ మండలి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేసిన ప్రక్రియను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలల ఖర్చులలో భాగంగా కమిషన్ విధించిన పరిమితులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే ఇలాంటి చట్ట వ్యతిరేక ప్రక్రియను చేసిందని న్యాయస్థానం పేర్కొంది. కమిషన్ చట్ట ప్రకారంగా తిరిగి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల తరపున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, రెగ్యులేటరీ కమిషన్ తరపున సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపించారు.